![]()
గీతాంజలి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాచలం, జూన్ 18 (మన భద్రాద్రి న్యూస్)
భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన గీతాంజలి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. వ్యాపార రంగంలో కొత్తగా అడుగుపెడుతున్న నిర్వాహకులు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు డాక్టర్ శంకరరావు, గుప్తా, కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, అరికెళ్ల తిరుపతిరావు, పెద్దినేని శ్రీనివాస్, రాము, యువ నాయకుడు గాడి విజయ్ తదితరులు పాల్గొన్నారు.








