![]()
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయం
- జర్నలిస్టుల సంక్షేమానికి పాలకులు చొరవచూపాలి
- 70 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన యూనియన్‌లో ఉండటం గర్వకారణం
- వృత్తికి కళంకం తెచ్చే కలుపు మొక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలి
- టియూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ
- రాష్ట్ర కార్యదర్శి రామ్ నారాయణ
కొత్తగూడెం,
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా టియూడబ్ల్యూజే (ఐజేయు) నిరంతరం పోరాటాలు సాగిస్తుందని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ అన్నారు. టియూడబ్ల్యూజే (ఐజేయు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3వ మహాసభ పూర్వ అధ్యక్షులు ఇమ్మంది ఉదయ్ కుమార్ అధ్యక్షతన ఆదివారం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా మృతి చెందిన జర్నలిస్టు మిత్రుల జ్ఞాపకార్థం మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గలిగిన జర్నలిస్టు యూనియన్ సభ్యులుగా ఉండటం మనందరి అదృష్టమన్నారు. ఆ నాటి నుండి నేటి వరకు యూనియన్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బలమైన యూనియన్‌గా ఉందని, దేశంలోనే నెంబర్ వన్ సంఘంగా ముందుకు దూసుకుపోతున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం నిరంతరం ప్రభుత్వానికి వినతులు అందిస్తూనే ఉన్నామని, ఉమ్మడి తెలుగు రాష్ట్రం వ్యాప్తంగా ఇప్పటికే 47 వేల అక్రిడేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వానికి వారధి అయిన జర్నలిజం వృత్తి ఎంతో పవిత్రమైందని, అలాంటి వృతి కొందరి కారణంగా దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తికే కళాంకాన్ని తెచ్చే కలుపు మొక్కల భరతం పట్టాలని చెప్పారు. బ్లాక్ వెతికిపట్టుకుని వృత్తి నుండి తప్పించాలన్నారు. సమాజాన్ని జాగృతం చేయాలనే తపన జర్నలిస్టుల మదిలో అనునిత్యం ఉండాలని, అలాంటి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి టియూడబ్ల్యూజే (ఐజేయు) నిత్యం ముందడుగులో ఉంటుందని, వృత్తిలో ఎదురయ్యే ఆటుపోట్లకు జర్నలిస్టులు భయపడకుండా నిజాన్ని నిర్భయంగా బహిర్గతం చేయాలన్నారు. కత్తిమీద సాములాంటిది ఇ జర్నలిస్టు వృత్తని, అలాంటి జర్నలిస్టులు సమాజ మేలుతో పాటు తమ హక్కుల సాధన కోసం నిరంతర పోరాటాలు చేయాలని టియూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి కే రామ్‌నారాయణ అన్నారు. అనగారిన వర్గాల గొంతుకగా జర్నలిస్టులు ఉన్నారని, అలాంటి జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డుల కోసం యూనియన్ తొలినాళ్ల నుండి రాజీలేని పోరాటం సాగిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతీ జర్నలిస్టులకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ ఫలాలు అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నోచుకోక పోవడంతో దేశరాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర వద్ద మన గళం వినిపించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డితో కలిసి యూనియన్ అధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు వివరించామని, వాటి పరిష్కారానికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర కృషి సాగుతోందని, నూతనంగా ఏర్పాటైన జిల్లా కార్యవర్గం ప్రతీ మూడునెలలకోసారి సమావేశాలు , సెమినార్లు నిర్వహించుకోవాలని, నానాటికి పెరుగుతున్న శాస్త్ర సాంకేతిక రంగాన్ని అందిపుచ్చుకుని వృత్తిలో నైపుణ్యాన్ని మరింతగా పెంచుకోవాలని సూచించారు.
టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులుగా రత్నం







