![]()
దమ్మపేట మండల కేంద్రంలో జన జాతర..!
- జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం
- జై జనసేన అంటూ మార్మోగిన పురవీధులు
- దమ్మపేట మండల అధ్యక్షులు రెహమాన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
- ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన నేత గడాల శ్రీనివాసరావు
దమ్మపేట, మన భద్రాద్రి న్యూస్, ఆగష్టు 02
మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన జనసేన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం విజయవంతంగా జరిగినందుకు మండల అధ్యక్షులు ఎస్.కే. రెహమాన్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన అధ్యక్షులు గడాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, నియోజకవర్గ స్థాయి జనసేన ఆత్మీయ సమ్మేళనాన్ని అద్భుతంగా నిర్వహించిన మండల అధ్యక్షుడు రెహమాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, రానున్న రోజుల్లో తెలంగాణలో జనసేన జెండా ఎగురుతుందని, అందుకు జనసైనికులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ సరిహద్దులో ఉన్న దమ్మపేట మండలం కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉందని, మన నాయకుడు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉన్నారని, ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దని అన్నారు.
ఇక్కడి నియోజకవర్గ పరిస్థితులపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో జనసేన జెండా ఎగరవేస్తామని, దమ్మపేట మండలంలో ఇప్పటికే ఒక వార్డు సభ్యుడిని గెలిపించుకున్నామని, ఇది విజయానికి సంకేతమని పేర్కొన్నారు.
రెహమాన్ అధ్యక్షతన రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటుదామని, పార్టీ కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు, మండల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.








