![]()
పడమట నర్సాపురం జెడ్ పి ఎస్ ఎస్ లో పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా క్షేత్రస్తాయి పరిశీలన
పడమట నర్సాపురం జెడ్పీహెచ్ఎస్ లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా గ్రామ సర్పంచ్ సంఘం లక్ష్మి కుమారి, ఎంఈఓ జంకిలాల్ పాఠశాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాల పరిశుభ్రత, విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. పాఠశాల అభివృద్ధికి గ్రామ పంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని సర్పంచ్ సంఘం లక్ష్మి కుమారి తెలిపారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై విద్యలో రాణించాలని ఎంఈఓ జంకిలాల్ ఆకాంక్షించారు.








