![]()
ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్
ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 9న నిర్వహించే కార్యక్రమాలను మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఆదివాసి నాయకులు పిలుపునిచ్చారు.
ఆదివాసి తొమ్మిది తెగల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ చుంచు రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బూర్గంపహాడ్ మండల జేఏసీ ఆదివాసి సంఘం మండల అధ్యక్షుడు తాటి సత్యనారాయణ మాట్లాడుతూ, మండలంలోని ప్రతి ఆదివాసి గూడెంలో ఆదివాసి జెండాను ఘనంగా ఆవిష్కరించి, అనంతరం కొత్తగూడెం కేంద్రంలో నిర్వహించే ఆదివాసి సాంస్కృతిక ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఆగస్టు 9న ప్రతి ఆదివాసి గ్రామంలో జెండావందనం నిర్వహించి ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఐక్యంగా, ఘనంగా జరుపుకోవాలని సమావేశంలో పాల్గొన్న ఆదివాసి పెద్దలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, యువత ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ సమావేశంలో ఆదివాసి నాయకులు పోడియం నరేందర్, ముసలమడుగు సర్పంచ్ పూణెం సురేందర్, మాజీ సర్పంచ్ కుర్సం వెంకన్న, నకిరేపేట సర్పంచ్ చర్ప వెంకటేశ్వర్లు, కనితి దేవా ప్రసాద్, సోంపల్లి మాజీ సర్పంచ్ తాటి వీరాంజనేయులు, నకిరేపేట గ్రామ పెద్దలు తాటి సారయ్య, తాటి వెంకటేశ్వర్లు, గుండి బాలరాజు, కల్లూరి చలపతిరావు, రామాపురం తాటి దానియేలు, జిన్నగట్టకు చెందిన ఉద్యోగులు, పలువురు ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.








