![]()
ఆగస్టు 9న నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పాయం నరసింహారావు పిలుపునిచ్చారు.
సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆదివాసీ నాయకులు, యువకులు, మహిళలు, దొర పటేళ్లు, ప్రజలందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఆదివాసీ ఐక్యతను చాటాలని కోరారు.
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 1/70 చట్టం, పేసా చట్టం, అటవీ హక్కుల చట్టాలు నిర్వీర్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాల పరిరక్షణ కోసం ఆదివాసీలందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఐడబ్ల్యూసీ నాయకులు జోగా రాంబాబు, కొమరం వెంకటేశ్వర్లు, కొమరం వెంకటకృష్ణ, కొమరం సతీష్, కల్తీ జోగయ్య, కల్తీ పాపయ్య, గొగ్గల బాబురావు, ఈసం సారయ్య, ఊకె నరేష్ తదితరులు పాల్గొన్నారు.








