![]()
– రవాణా, పోలీసు శాఖల ఆధ్వర్యంలో వాహన తనిఖీలు
– ఇసుక లారీలపై కేసులు నమోదు చేసిన రవాణా శాఖ అధికారి రాజశేఖర్ రెడ్డి
ప్రయాణికుల సౌకర్యాన్ని గాలికి వదిలి రహదారిపై యథేచ్ఛగా లారీలు నిలుపుతున్న వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. బుధవారం మండల పరిధిలోని కుదునూరు గ్రామంలో రవాణా, పోలీసు శాఖల ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో చర్ల సీఐ ఏ. రాజు వర్మ, భద్రాచలం రవాణా శాఖ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై ఆర్. నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో రోడ్డుపై నిలిపిన ఇసుక లారీలపై కేసులు నమోదు చేశారు.
ప్రధాన రహదారులపై ఇష్టానుసారంగా లారీలు నిలిపివేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇసుక ర్యాంపు నిర్వాహకుల తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోడింగ్ కోసం వచ్చే వాహనాలకు తప్పనిసరిగా పార్కింగ్ స్థలాలు చూపించాలని, రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపితే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రోజూ వేలాది మంది ప్రయాణించే రహదారులను పార్కింగ్ ప్రదేశాలుగా మార్చితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
వాహన తనిఖీల్లో చర్ల సీఐ ఏ. రాజు వర్మ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై ఆర్. నర్సింహారెడ్డి, రవాణా శాఖ, పోలీసు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.








