![]()
బదిలీపై వెళ్తున్న సీఐ అశోక్ రెడ్డికి ఘన సన్మానం
మండలంలో ఆయన సేవలు అభినందనీయం: దోసపాటి పిచ్చేశ్వరరావు
అశ్వాపురం, జూన్ 16 (మన భద్రాద్రి న్యూస్):
అశ్వాపురం మండలంలో రెండేళ్లకు పైగా సీఐగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న సీఐ అశోక్ రెడ్డికి దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, శివకామేశ్వరీ గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వరరావు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా దోసపాటి పిచ్చేశ్వరరావు మాట్లాడుతూ, విధి నిర్వహణలో సీఐ అశోక్ రెడ్డి అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. మండలంలోని అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించారని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత స్థానాలకు ఎదిగి, ఆయురారోగ్యాలతో సేవలు కొనసాగించాలని భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
సన్మానానికి స్పందించిన సీఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, అశ్వాపురం మండలంలో విధులు నిర్వహించే సమయంలో సహకరించిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా దోసపాటి పిచ్చేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణలో విజయవంతంగా పనిచేయగలిగానని పేర్కొన్నారు.








