![]()
ముత్యాలమ్మ ఆలయ ఫంక్షన్ హాల్ ప్రారంభం
– రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్, ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను గ్రామ సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్, ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్ ఆదివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కొబ్బరికాయ కొట్టి ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించారు. గ్రామ ప్రజలకు, భక్తులకు ఈ ఫంక్షన్ హాల్ ఉపయోగపడేలా అందుబాటులోకి రావడం శుభపరిణామమని సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్ పేర్కొన్నారు.
అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ ఎస్.వి. రెడ్డి, కమిటీ సభ్యులు సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఘన స్వాగతం పలికి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో 13వ వార్డు సభ్యురాలు మూలం నవ్యశ్రీ, 14వ వార్డు సభ్యురాలు కొమరం సావిత్రి, పోతిరెడ్డి అశోక్ రెడ్డి, దామెర ఆదినారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పూలపల్లి సుధాకర్ రెడ్డి, టీఎన్టీయూసీ (ఐటీసీ) గుర్తింపు సంఘం అధ్యక్షుడు కనకమెడల హరిప్రసాద్, ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి మారం వెంకటేశ్వర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకురాలు తాత మాధవీలత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రముఖులు కేవీవీ సత్యనారాయణ, ఓబుల్ రెడ్డి, నాగరాజు, శేష్ రెడ్డి, జలగం చంద్రశేఖర్, నరేష్, శ్రీనివాస్, వెంకటరెడ్డి, పిచ్చి రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.








