![]()
రాత్రి వేళ కూడా ఆగని పోలీసుల రెస్క్యూ ఆపరేషన్
- వరదల్లో చిక్కుకున్న మరో 10 మందిని కాపాడిన చర్ల పోలీసులు
చర్ల, మన భద్రాద్రి న్యూస్, జూలై 31
గోదావరి వరద ఉద్ధృతికి ఇసుక ర్యాంపు నీట మునగడంతో అక్కడ వివిధ పనులకు వెళ్లిన సుమారు 50 మంది కార్మికులను చర్ల పోలీసులు,రెవిన్యూ బృందం శుక్రవారం పగలు అతి కష్టమ్మీద ఒడ్డుకు చేర్చారు.అంతా సురక్షితంగా బయటకు వచ్చారని అనుకుంటుండగా, సుమారు 10 మంది కార్మికులు ర్యాంపు వద్ద చిక్కుకున్నారనే సమాచారం అందడంతో చర్ల సీఐ రాజువర్మ,ఎస్ఐ నర్సిరెడ్డి రెస్క్యూ టీమ్‌తో కలిసి వెంటనే రంగంలోకి దిగారు. రాత్రి 10 గంటల సమయం చిమ్మచీకటిగా ఉన్నా, ప్రమాదం ఉందని తెలిసినా వెనుకాడకుండా టార్చ్ లైట్ల వెలుతురులో పడవ సహాయంతో గోదావరిలోకి వెళ్లి చిక్కుకున్న మరికొంతమందిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు.
ప్రాణాలకు తెగించి రెస్క్యూ చేసిన సీఐ రాజువర్మ, ఎస్ఐ నర్సిరెడ్డిల సేవలను మండల ప్రజలు అభినందించారు.








