![]()
*రూ.1.50 కోట్లతో ఆధునిక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం… భూమిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు*
📅 తేదీ: 08-07-2026
📍 స్థలం: నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామం, బూర్గంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
🔹బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో రూ.1 కోటి 50 లక్షల వ్యయంతో ఆధునిక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి *పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు* భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
🔹ఈ సందర్భంగా *ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు* మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామ ప్రజలు సామాజిక, సాంస్కృతిక, విద్యా, శుభకార్యాలు మరియు ఇతర సామూహిక కార్యక్రమాలను సౌకర్యవంతంగా నిర్వహించుకునేందుకు ఈ ఆధునిక కమ్యూనిటీ హాల్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ ఆధునిక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరిస్తున్న ఐటీసీ సంస్థ వారికి అభినందనలు తెలిపారు.
🔹ప్రజల అవసరాలు, గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నాణ్యతతో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పినపాక నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని *ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు* స్పష్టం చేశారు.
🔹ఈ కార్యక్రమంలో ITC అధికారులు, MRO, ఎంపీడీవో, హౌసింగ్ ఏఈ, మండల అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








