![]()
రేపు చర్లలో మెడికల్ షాపుల బంద్..
కావాల్సిన మందులు ఈరోజు కొనుగోలు చేసుకోండి..
ప్రజలు బంద్ కు సహకరించాలని కోరిన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్
చర్ల, మన భద్రాద్రి న్యూస్,మే 19 : రేపు బుధవారం దేశవ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ షాప్ ల బందులో భాగంగా చర్లలో కూడా మెడికల్ షాపులు బంద్ నిర్వహించనున్నట్లు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది,ఆన్లైన్ విక్రయాలను నిలిపేయాలని ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ రేపు బుధవారం బంద్కు పిలుపునిచ్చింది.ప్రధానంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం, భారీ డిస్కౌంట్లతో చిరు వ్యాపారుల పొట్ట కొడుతోన్న ఆన్లైన్ ఫార్మసీల విక్రయాలను అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆన్లైన్ అమ్మకాలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు.దీనికి నిరసనగానే పెద్ద ఎత్తున దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.ఈ నేపథ్యంలో వినియోగదారులు వెంటనే తమకు కావలసిన మందులు ముందు రోజే కొనుగోలు చేసి సమకూర్చుకోవాలని విజ్ఞప్తి చేసింది.ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆన్లైన్ అమ్మకాలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇక ప్రజలకు కూడా అత్యవసర మందుల అవసరం ఉంటే వెంటనే కొనుగోలు చేసుకోవాల్సిందిగా సూచిస్తుంది. ముందే మందులు కొనుగోలు చేస్తే ఇబ్బందులు పడకుండా ఉంటారు. మెడికల్ షాపులు బంద్ ఉన్న నేపథ్యంలో ప్రజలు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.







