![]()
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి
నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిం చాలి
రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలి
జిల్లా కలెక్టర్ అంకిత్
విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్ర కారం నాణ్యమైన, పోషకాహారం అందించాల ని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదే శించారు.బూర్గంపాడు మండలంలో జిల్లా కలె క్టర్ అంకిత్ సోమవారం ఆకస్మిక తనిఖీలు ని ర్వహించారు. మొదట తెలంగాణ అల్పసం ఖ్యాక గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ పాఠశాలలోని కిచెన్ షెడ్, స్టోర్ రూమ్, తరగతి గదులు, వసతి గృహాలను పరిశీలిం చారు. కిచెన్ షెడ్లో వంటల తయారీ విధానా న్ని పరిశీలించి వంటశాల, భోజనశాల పరిస రాల్లో పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించా లని సూచించారు. మెనూ చార్ట్‌ను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారమే ఆహారం అందు తున్నదా లేదా అని ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెనూ అమ లులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడా లని సూచించారు.అనంతరం స్టోర్ రూమ్‌ను పరిశీలించి నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, నిత్యావసర సరుకులు, కూరగాయల నాణ్య తను తనిఖీ చేశారు. ఎప్పటికప్పుడు తాజా కూరగాయలను మాత్రమే వంటకు వినియో గించాలని, ఆహార పదార్థాల నిల్వ, వినియో గంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పా టించాలని ఆదేశించారు. విద్యార్థులకు అం దించే ఆహారం నాణ్యత విషయంలో రాజీ ప డవద్దని సూచించారు.విద్యార్థులతో మాట్లా డిన కలెక్టర్ పాఠశాలలో అందుతున్న విద్య, వసతి, భోజనం, తాగునీరు, ఇతర మౌలిక స దుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు.నూ తన విద్యా సంవత్సరంలో విద్యార్థుల చేరిక లు, హాజరు శాతం, బోధనా కార్యక్రమాల ని ర్వహణ తదితర అంశాలపై ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులను అడిగి తెలుసుకు న్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవస రమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచిం చారు.
రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలి:
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు నిరంతరం అందుబాటులో ఉండేలా జిల్లా క లెక్టర్ అంకిత్ అన్నారు.మోరంపల్లి బంజర గ్రా మంలోని శ్రీ లక్ష్మి గణపతి ఫెర్టిలైజర్ దుకాణా న్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు అవ సరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు తగినంతగా అందుబాటులో ఉన్నా యా లేదా అనే విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. దుకాణం లోని పత్తి విత్తనాల ప్యాకెట్లు, వివిధ రకాల ఎరువులు, పురుగుల మందుల నిల్వలను త నిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి ని ల్వలు, విక్రయాల వివరాలను అడిగి తెలుసు కున్నారు. గోదాములో నిల్వ ఉంచిన యూరి యా బస్తాలను పరిశీలించి నిల్వల పరిస్థితిని సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని డీలర్లకు సూచించారు. రైతులకు నాణ్యమైన వ్యవసా య ఇన్పుట్లు అందించడంలో నిర్లక్ష్యం ఉండ రాదన్నారు. స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ నిల్వలు, విక్రయాల వివరాలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
వ్యవసాయ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా వ్యవసాయ శాఖ అధికారులు ని రంతరం పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశిం చారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్ర యాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగితే సం బంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మ ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బూర్గంపా డు తహశీసిల్దార్ కె.ఆర్.కె.వి ప్రసాద్,డిప్యూటీ తాసిల్దార్ సమ్మయ్య, ఎంపీడీవో జమలా రెడ్డి, ఎంపీవో రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ నాగజ్యోతి, వ్యవసాయ శాఖ అధికారి ఏవో శంకర్, హౌసింగ్ ఏడి, జి పి ఓ లు తదిత రులు పాల్గొన్నారు.








