![]()
విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎస్జీటీ బి. వెంకటేశ్వర్లు చేయూత
– కోయగూడెం ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు టేబుల్ బుక్స్ పంపిణీ
టేకులపల్లి, జూలై 11 (మన భద్రాద్రి న్యూస్)
విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో టేకులపల్లి మండలంలోని కోయగూడెం ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడు బి. వెంకటేశ్వర్లు తన సొంత ఖర్చులతో 20 మంది ప్రాథమిక విద్యార్థులకు టేబుల్ బుక్స్ అందజేసి ఆదర్శంగా నిలిచారు.
పాఠశాల ఉపాధ్యాయుడు డి. నాగేశ్వరరావు చేతుల మీదుగా విద్యార్థులకు టేబుల్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ చూపి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, అందించిన విద్యా సామగ్రిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విద్యా సామగ్రిని అందించిన బి. వెంకటేశ్వర్లును పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. విద్యకు ప్రాధాన్యతనిస్తూ చేపడుతున్న ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాము, రవికుమార్, కిషోర్ సింగ్, రమాదేవి, మోతీలాల్, భద్రూ, రమేష్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.








