![]()
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హౌసింగ్ ఏఈ వెంటనే సస్పెండ్ చేయాలి..రాచన్నగూడెం సర్పంచ్ మడకం విజయ
- అధికారి తీరుపై మండిపాటు
- సర్పంచ్, కార్యదర్శుల మాటను సైతం ఖాతర్ చేయని హౌసింగ్ ఏఈ
- నెల రోజులుగా అందుబాటులో లేకపోవడంతో ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు పెండింగ్
- పైసలిస్తే బిల్..లేదంటే నిల్
- అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
ములకలపల్లి,మే 10,మన భద్రాద్రి న్యూస్:- మండలంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారిందని మాస్ లైన్ నాయకురాలు,రాచన్నగూడెం సర్పంచ్ మడకం విజయం ఆరోపించారు.ఆదివారం రాచన్నగూడెంలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఇందిరమ్మ లబ్ధిదారులు అందిన దగ్గర అప్పు చేస్తూ నానా అగచాట్లు పడుతూ ఇంటి నిర్మాణం పూర్తి చేస్తున్నారని ,ఈ క్రమంలో కొన్ని ఇండ్లు స్లాబ్ వరకు పూర్తవగా మరి కొన్ని స్లాబ్ దశలో ఉన్నాయని అన్నారు.

- నెల రోజులుగా హౌసింగ్ ఏఈ అందుబాటులో లేడని, ఫోన్ చేసిన ఎత్తడం లేదని బిల్లులు కోసం లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఇంటికి ఐదు నుండి పది వేలు లంచం ఇచ్చిన వారికి మాత్రమే ఫొటోలు తీస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఎమ్మెల్యే లు, మంత్రులతో సమీక్షలు చేసి రానున్నది వర్షా కాలం ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇస్తుంటే మండలంలో సంబంధిత ఏఈ పరిస్థితి ఇలా ఉండడంబ శోచనీయం అన్నారు.ఏఈ పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు.







