![]()
గత కొన్ని రోజుల క్రితం త్రిపుర నుంచి BSF సిబ్బందిని జమ్మూ కాశ్మీర్‌కు అమర్నాథ్ యాత్ర కోసం తరలిస్తున్నారు. ఈక్రమంలో రైల్వే అధికారులు జవాన్లకు శిథిలావస్థలో మురికిగా ఉన్న రైల్వే కోచ్‌ను కేటాయించారు. దీన్ని ఓ ప్యాసింజర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది నెట్టింట్లో వైరల్ అయ్యింది. దేశాన్ని రక్షించే సైనికులు అత్యంత హీన పరిస్థితిలో ప్రయాణించాల్సి వచ్చిందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రజలు ఈ విషయంపై సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తీవ్ర విమర్శలను రేకెత్తించింది.
ఈ విషయం బుధవారం రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ దృష్టికి వెళ్లగా వెంటనే యాక్షన్ తీసుకున్నారు. నలుగురు రైల్వే అధికారులను సస్పెండ్ చేస్తూ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. అగర్తలలోని ఉదయపూర్ స్టేషన్ నుంచి BSF దళాల కోసం మంత్రిత్వ శాఖ పూర్తిగా కొత్త రైలును ఏర్పాటు చేసింది. భద్రతా దళాల గౌరవం అత్యంత ముఖ్యమైనదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సందర్భంగా అన్నారు.
అలీపుర్దువార్ రైల్ డివిజన్‌కు చెందిన ముగ్గురు సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు, కోచింగ్ డిపో అధికారిని రైల్వే మంత్రి సస్పెండ్ చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రెస్ నోట్ తెలిపింది.


