![]()
భారత-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో BCCI ఒక కీలక నిర్ణయం తీసుకుంది. IPL 2025 ను వాయిదా వేస్తున్నట్టు భారతీయ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. “ఐపీఎల్ ని ప్రస్తుతనికి వాయిదా వేస్తున్నామని కేంద్రం, అన్ని ఫ్రాంచైజీలు, సంబంధిత వ్యక్తుల సలహా తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. నేటి నుంచి ఎలాంటి మ్యాచ్ జరగదు.”
IPL 2025 లో 57 మ్యాచ్లు విజయవంతంగా జరిగాయి, అయితే మే 8న ధర్మశాలలో జరిగిన 58వ మ్యాచ్ (PBKS vs DC) ను భద్రతా కారణాల రీత్యా ఆపివేశారు. జమ్ముతో సహా అనేక ప్రాంతాలలో పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది, వాటిని భారత సైన్యం ఖండించింది. కానీ జాగ్రత్త చర్యగా ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ను ఆపివేసి ఆటగాళ్లను హోటళ్లకు తరలించారు.


