Friday, March 27, 2026
HomeTelangana Newsఅంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌: సీఎం రేవంత్‌ రెడ్డి

అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌: సీఎం రేవంత్‌ రెడ్డి

Loading

హైదరాబాద్‌, మన భద్రాద్రి న్యూస్, మార్చి 02

రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు,బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖపై అధికారులతో శనివారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ హాజరు ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలపై దృష్టి సారించాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొబైల్‌ అంగన్వాడీ కేంద్రాలపై అధ్యయనం చేయాలని చెప్పారు.ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, తదితర అధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page