![]()
అంగరంగ వైభవంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్
ఇల్లందు ప్రభుత్వ ఉన్నత పాఠశాల జేబీఎస్ పాఠశాల నందు ఈరోజు 2001- 2002 సంవత్సర 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో విద్యార్థులు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందుగా దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఉపాధ్యాయులు: తోటమల్ల రమ భద్రాచలం ఎం ఈ ఓ.ప్రసాద్ హనుమకొండ ఎం.ఈ.ఓ, సిహెచ్ రాంబాబు ,రఫీ , క్రిస్టఫర్ రాములు ల ను పూల మొక్కలు ,శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి,ఘనంగా సన్మానించుకున్న పూర్వ విద్యార్థులు. అనంతరం వారు మాట్లాడుతూ జేబీఎస్ పాఠశాల నందు గత మధుర స్మృతులను నెమరువేస్తూ వారి యొక్క జ్ఞాపకాలను పంచుకున్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆ రోజులలో విద్యార్థులు చదువు కోసం పాఠశాలకు వచ్చేవారని, ఈ కాలంలో చదువు వదిలేసి మిగతా అన్ని విషయాలకు పాఠశాలకు వస్తున్నారని వారు అన్నారు.
ఈ పాఠశాల ఒక విశ్వవిద్యాలయం లాంటిదని, ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు సుమారు 20 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారని, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఆరుగురు స్థిరపడ్డారని, ప్రతి ఒక్కరూ అన్ని రంగాలలో స్థిరపడ్డందుకు చాలా ఆనందంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా బొజ్జ నరసింహారావు రవి నాయక్, కమలాకర్ రాజు,నరసింహారావు, వెంకటరమణ, అయూబ్, సందీప్, కమలాకర్, భద్ర, మధుకర్, శంకర్,
ముత్యాల రమేష్,చందర్, గడ్డం బిక్షపతి ఉపేందర్ ఎం శ్రీకాంత్ ,మాలిక్ సతీష్, రహీం, శివ విజయ్ వెంకటమ్మ బాలరాజు జానకిరామ్ వినయ్ బొల్లం శీను గంట శీను తన్వీర్ భరత్ మహేష్, గోవర్ధన్ 2001-2002 10వ తరగతి విద్యార్థిని,విద్యార్థులు అందరూ పాల్గొన్నారు…. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు 23 సంవత్సరాల తర్వాతకి జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో గత స్మృతులను తలుచుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో స్థిరపడి ఒకసారి కలుసుకోవడంతో గత స్మృతులను నెమర వేసుకొని భావోద్వేగాన్ని గురయ్యారు తమకు పాఠాలు నేర్పించిన జీవితంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చిన పాఠశాల ఉపాధ్యాయుల రుణం ఎప్పటికీ మర్చిపోలేని తీర్చుకోలేమని ఈ సందర్భంగా విద్యార్థులు వారి వారి మాటలలో వారు వారి భావాన్ని వ్యక్తపరిచారు.


