![]()
ఉపాధి కల్పనలో స్థానికులకు మొండిచేయి
- – అంతా మా ఇష్టం, మాకు నచ్చిందే చేస్తాం
- – సింగరేణి అధికారుల ఆదేశాలను సైతం లెక్క చేయని ఓబి కంపెనీల యాజమాన్యాలు
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్
ఉపాధి కల్పనలో స్థానికులకు మొండిచేయి చూపిస్తూ, స్థానికేతర్లకు పెద్దపీట వేస్తూ ఒకరు ఇద్దరు కైనా ఉపాధి కల్పించమని ఏరియా అధికారులు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని సింగరేణి ఓ బి యాజమాన్యాలు, స్థానికులకు 80 శాతం ఉపాధి కల్పించాల్సిందేనని స్వయానా డైరెక్టర్ పా నేటి సింగరేణి ఎండి బలరాం ఆదేశాలను సైతం పక్కన పెట్టారంటే సింగరేణిలో ఓబీ కంపెనీలు ఎంతటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో అర్థం చేసుకోవాలి.
వివరాల్లోకి వెళితే మణుగూరు సింగరేణి ప్రైవేట్ ఓబీ కంపెనీలలో పని చేయడానికి స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఈ ప్రాంత టీం లీడర్ అయిన సింగరేణి ఏరియా జిఎం స్వయానా సంతకం చేసి పనికి తీసుకోమని చెప్పినప్పటికీ, క్రింది స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. సింగరేణి భూ నిర్వాసిత నిరుద్యోగి చేసుకున్న దరఖాస్తు పైన సింగరేణి జిఎం సంతకం చేసి పంపినా కూడా ఆ సంతకానికి విలువ లేకుండా ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ స్థానిక నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు. స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించకుండా, దొడ్డిదారిలో స్థానికేతర్లను పనిలో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
సింగరేణి ఏరియా హాస్పిటల్లో, ఎంపీటీసీ శిక్షణకై ఓబి కంపెనీలు ప్రతిరోజు పంపిస్తున్న మెడికల్, మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ శిక్షణకు వంద మందిలో ఒకరు ఇద్దరు స్థానికులు, అది కూడా పెద్దపెద్ద నాయకులు, అధికారులు సిఫారసు చేస్తే మాత్రమే అంటే ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్న వైనం. మహాలక్ష్మి, దుర్గా ఓబి కంపెనీల చెక్ పోస్ట్ దగ్గర వాచ్ మెన్ లు నిరుద్యోగులను, చివరికి కార్మిక సంఘాల నాయకులను కూడా సైట్ ఆఫీస్ లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు కంపెనీకి సంబంధించిన మేనేజర్ గాని, ఏజెంట్ గాని ఎప్పుడు కూడా కలిసే పరిస్థితి లేదు. ఏజెంటు పెట్టిన సంతకానికి కూడా విలువ లేకుండా రెండు నెలల నుంచి నిర్వాసితుడ్ని సింగరేణి అధికారులు తిప్పుతున్నారు. ఇంత దౌర్భాగ్య స్థితిలో ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి. కార్మిక సంఘాల నాయకులు చెప్పినా గాని నిర్లక్ష్యం చేస్తూ అహంకార ధోరణిలో ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ఏకచత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోంది.
సింగరేణి బొగ్గు గనుల ఏర్పాటుపై సర్వం కోల్పోయి అన్నమో రామచంద్రా అంటూ దీనంగా సింగరేణి వైపు చూస్తున్న స్థానికులు, నిర్వాసితుల ఉపాధి కల్పన విషయమై “సింగరేణి సామాజిక బాధ్యత” లో భాగంగా చర్యలు చేపట్టాలని, స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించాలని, స్థానికులకు 80% ఉపాధి అవకాశాలు కల్పించేలా ఎండి బలరాం ఆదేశాలు అమలు చేయాలని, అమలు చేయని స్థానిక యాజమాన్యాల పై, కాంట్రాక్టర్లపై స్థానిక యాజమాన్యం చర్యలు తీసుకోవాలని, ఆకలితో అలమట్టిస్తున్న నిరుద్యోగులు కోరుతున్నారు.


