![]()
అందరూ కలిస్తే ఏదైనా సాధించగలం
- జిల్లా అధ్యక్షులు సుధాకర్
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్
చండ్రుగొండ మండలం లో గురువారం ప్రైవేట్ ఎలక్ట్రిషన్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేశ్వర రావు మాట్లాడుతూ లేబర్ కార్డు ప్రతి ఎలక్ట్రిషన్ తీసుకొని ఉండాలి అని, గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాన్ని ప్రతి ఎలక్ట్రిషన్ తెలుసుకోవాలి అని సూచించారు. ప్రభుత్వం ప్రమాద భీమ కింద ఇచ్చే ఆరు లక్షల రూపాయలను 10 లక్షల రూపాయలుకి పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ ఎలక్ట్రిషన్స్ అందరూ కలిసి సంఘం లాగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం అని అన్నారు. మండల అధ్యక్షుడు షేక్ అసిఫ్ జిల్లా నుంచి వచ్చిన అధ్యక్ష, కార్యదర్శిలకు, వివిధ మండలాల నుండి వచ్చిన కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి బాబ్జి, జూలూరుపాడు మండలం అధ్యక్షులు సుగుణ రావు, ప్రధాన కార్యదర్శి నరేష్, చుండ్రుగొండ మండల ఉపాధ్యక్షుడు బాబురావు, ప్రధాన కార్యదర్శి మన్నెం వీరేంద్ర ప్రసాద్, నజీర్, హైమద్, అబిద్, హబీబ్, రమేష్, లక్ష్మణ్, వెంకటాచారి మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


