![]()
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, ఆగస్టు 01
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో చండ్రుగొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనీ ఇన్వర్టర్ కాలిపోవడం జరిగింది. ప్రమాదము ఏమీ జరగలేదు. ఆస్పత్రికి వచ్చిన పేషంట్స్ ఈ రాత్రి మొత్తం అంధకారంలోనే ఉండవలసిన పరిస్థితి వస్తుంది అంటున్న ఆసుపత్రి సిబ్బంది. డాక్టర్ తనూజాని వివరణ కోరగా అధికారులతో మాట్లాడి తక్షణమే చేపిస్తామంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించాలని ఆసుపత్రికి వచ్చిన ప్రజలు కోరుతున్నారు.


