Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఅక్రమంగా నిల్వ ఉంచిన 900 క్యూబిక్ మీటర్ల ఇసుక స్వాధీనం

అక్రమంగా నిల్వ ఉంచిన 900 క్యూబిక్ మీటర్ల ఇసుక స్వాధీనం

Loading

అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటాం

-మండల తహసీల్దార్ మేకల ఇమ్మానుయేల్

గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూన్ 06

మండల పరిధిలోని ముత్తాపురం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 18 వందల ట్రాక్టర్ల (900 క్యూబిక్ మీటర్లు) ఇసుకను గిర్దావర్ 2 సమాచారం మేరకు గుండాల మండల తహసీల్దార్ మేకల ఇమ్మానుయేల్ గురువారం సీజ్ చేశారు. నిల్వ ఉంచిన ప్రదేశాన్ని పరిశీలించగా ముత్తాపురం గ్రామానికి చెందిన మోకాళ్ళ బుచ్చయ్యకి చెందిన సర్వే నంబర్ 39/ఏ స్థలంలో ఇసుక నిల్వ ఉంచినట్లు ఆయన తెలిపారు. పంచనామ నిర్వహించి ఇసుక నిల్వలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలించినా లేదా నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page