![]()
అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దు
-ఎస్సై రాజేందర్ విజ్ఞప్తి
కరకగూడెం, మన భద్రాద్రి న్యూస్, జూలై 21
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరకగూడెం మండల ఎస్సై రాజేందర్ ఆదివారం సూచించారు. భారీగా వరదలు వస్తుందడంతో చేపల వేటకు వెళ్లడం కానీ, కాలువలు, వాగులు దాటడం గాని ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు వర్షాలకు అప్రమత్తంగా ఉంటూ, ఎటువంటి సమస్య వచ్చినా తక్షణమే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.


