![]()
‘ అమిత్ షా ‘ సభకు బయలుదేరిన భద్రాచలం బీజేపీ నాయకత్వం
భద్రాచలం, మన భద్రాద్రి బ్యూరో
బీజేపీ – తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియం హైదరాబాద్ లో నిర్వహించే విజయ సంకల్ప సమ్మేళనం బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభలో పాల్గొననున్న భద్రాచలం బీజేపీ నాయకత్వం ప్రయాణించే బస్ ను బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కుంజా ధర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు.
తెలంగాణ బీజేపీ పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షులకు, ఆ పై మండల, జిల్లా కమిటీల అధ్యక్షులకు, నాయకులకు పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసే మార్గ నిర్దేశం చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్ల, దుమ్ముగూడెం , భద్రాచలం మండలాలకు చెందిన నాయకులు బయలుదేరారు. బీజేపీ సీనియర్ నాయకులు జి.త్రినాథ రావు, బిట్రగుంట క్రాంతి, పసుమర్తి సతీష్, యం. మోహన్ రావు, ముక్కెర కోటేశ్వరి, నక్కా కన్నయ్య, కారం చిన్నయ్య, ఆపక శ్రీను, ముత్యాల శ్రీనివాస్, యం.నిఖిల్, సాయి, త్రినాథ్ రెడ్డి, సుందర్ రావు, శ్రీహరి, టైలర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొంటున్నారు.


