![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ఓడిపోయిన 2020 అధ్యక్ష ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్, విచ్చలవిడిగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, దీనిపై న్యాయ శాఖతో సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించారు. దీన్ని- అమెరికా చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. అప్పటి ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. రిగ్గింగ్ జరిగిందంటూ అప్పట్లోనే ఆరోపించారు. ఎన్నికల అవకతవకలను అరికట్టడానికి, మెయిల్-ఇన్ లేదా ముందస్తు ఓటింగ్‌ను నిలిపివేయాలని, ఓటు వేయడానికి ఓటర్ ఐడీని తప్పనిసరి చేయాలని ట్రంప్ సూచించారు. కాలిఫోర్నియాలో అమలులో ఉన్న ప్రపోజల్- 50ని కూడా ఆయన విమర్శించారు. ఇది యూఎస్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్స్ ను పునర్వ్యవస్థీకరించడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలు ఇవి. దీన్ని కూడా తప్పుపట్టారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేశారు.
2020 అధ్యక్ష ఎన్నికల్లో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయని, ఒకరి విజయాన్ని మరొకరు మోసం చేసి దొంగిలించారని విమర్శించారు. అమెరికా చరిత్రలోనే ఇది అతి పెద్ద కుంభకోణమని పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ను మోసగాడంటూ ఆరోపించారు. మనం ఎన్నుకున్న అధ్యక్షుడే మనల్ని మోసగించినపప్పుడు దేశానికి ఏమి జరిగిందో చూడండి.. అని అన్నారు. అప్పుడేం జరిగిందో ఇప్పుడు బయటపడిందని, డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ దీనిపై విచారణ కొనసాగించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. విచారణ జరగకపోతే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఇది పునరావృతమౌతుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా ఆయన ఎన్బీఏ క్యాసినో స్కాండల్ తో పోల్చారు. కాలిఫోర్నియా ప్రపోజల్- 50 కూడా ఎంతమాత్రం సరికాదని చెప్పారు. ఓటింగ్ లో ఎటువంటి నిజాయితీ లేదని, లక్షలాది బ్యాలెట్లు కాలిఫోర్నియాలోకి అక్రమంగా అడుగుపెడుతున్నాయని విమర్శించారు. మెయిల్-ఇన్ లేదా ముందస్తు ఓటింగ్ వద్దని, ఓటర్ ఐడీతోనే ఈ ఎన్నికలను జరిపించాలని అన్నారు. ఆలస్యం కాకముందే రిపబ్లికన్లు తెలివి తెచ్చుకోవాలని సూచించారు.
కాలిఫోర్నియా ప్రపోజల్- 50 డెమోక్రాట్లకు అనుకూలంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ భావిస్తోన్నారు. ఓ ఇండిపెండెంట్ కమిషన్ రూపొందించిన డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ మ్యాప్‌లను ఇందులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ మ్యాప్‌లు కాలిఫోర్నియాలో నిర్వహించబోయే మధ్యంతర ఎన్నికల కోసం ఉపయోగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో డెమోక్రాట్లు తమకు అనుకూలంగా ఉండేలా దీన్ని పునర్వ్యవస్థీకరించారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తోన్నారు.


