![]()
-కాంగ్రెస్ నాయకులు
అశ్వారావుపేట, మన భద్రాద్రి న్యూస్, మే 21
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మహా నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని మంగళవారం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ అణగారిన బతుకుల్లో వెలుగులు నింపారని, ఆఖరి క్షణం వరకు దేశం కోసమే బ్రతికిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. అనంతరం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మ రాంబాబు, జూపల్లి ప్రమోద్, నండ్రు రమేష్, బూసి పాండు, ఫణి, నాగు, నవీన్, బాబీ, గోపి, పలగని సుబ్బారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.


