![]()
- జిల్లా వ్యాప్తంగా ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు
- ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్
కొత్తగూడెం, మన భద్రాద్రి బ్యూరో, జులై 02
బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ – ఎక్స్ ది.01.07.2024 నుండి 31.07.2024 వరకు నిర్వహించబడుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పరిశ్రమలు, వ్యాపార సముదాయాలలో బాల కార్మికుల విముక్తి కోసం దాడులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు ప్రత్యేక బృందాలను ఈ దాడులను నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ దాడులలో భాగంగా బాల కార్మికులను పట్టుకొని వారికి విముక్తి కలిగించడం జరిగుతుందని తెలిపారు. బాలబాలికలను పనిలో పెట్టుకున్న యాజమానులపై కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ – ఎక్స్ బృందాల ద్వారా పట్టుకున్న చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించడం జరుగుతుందని వివరించారు. అనంతరం పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. అనాధ పిల్లలను సంరక్షణ గృహాలకు తరలించడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్ 100 కి కానీ 1098 కి కానీ ఫోన్ చేసి పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ ముస్కాన్ – ఎక్స్ ద్వారా జిల్లాలో బాల కార్మికులను గుర్తించి వారిని సంరక్షించడమే ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా తెలియజేశారు.


