![]()
-సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుండ్రు విజయ్
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జూన్ 04
మండలంలోని మద్దుకూరు గ్రామపంచాయతీలో నిధులు లేక గ్రామంలో మౌళిక సదుపాయాలు లేక గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుండ్రు విజయ్ గురువారం అన్నారు. ఆయన మాట్లాడుతూ రాత్రి వేళలో ఎక్కువగా మద్దుకూరు గ్రామంలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, అలా జరిగడానికి గ్రామంలో వీధి దీపాలు వెలగక ప్రమాదాలు ఎక్కువగా జరిగే పరిస్థితులు చాలా ఉన్నాయని అన్నారు. వీధులలో కాకుండా మెయిన్ రోడ్డుకు కూడా వీధి దీపాలు వెలగడం లేదని, పారిశుద్ధ్య పంచాయతీ ట్రాక్టర్ డీజిల్ డబ్బులు లేక వారానికి ఒకసారో, 15 రోజులకు ఒకసారో చెత్తను తీసుకుపోవడానికి వీధుల్లోకి వస్తుందని, ఇలా 15 రోజులకు ఒకసారి రావడం వలన గ్రామాలలో చెత్త పేరుకుపోయి, దోమలు ఎక్కువై ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని అన్నారు. గ్రామపంచాయతీకి ఎటువంటి నిధులు రావడం లేదని, ఇంటి పన్నులు మొత్తం 62,000 రూపాయలు వస్తున్నాయని, గ్రామపంచాయతీ కరెంటు బిల్లు మాత్రం 65,000 రూపాయలు వస్తుందని, గ్రామపంచాయతీ కార్మికులకు జీతభత్యాలు లేక ఒకరిద్దరు కార్మికులు పనికి కూడా రావడం లేదని తెలిపారు. వారికి కూడా కుటుంబ పోషణ చాలా భారమై డబ్బులు లేక వేరే పనులకు వెళ్ళవలసి వస్తుందని, ఇలా కార్మికులకు డబ్బులు లేక గ్రామపంచాయతీ నానా అవస్థలు పడుతుందని, ఈ వార్త తెలిసిన వెంటనే అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పారిశుద్ధ్య కార్మికుల జీతభత్యాలు వెంటనే విడుదల చేసే ఏర్పాటు చేయాలని, అలాగే గ్రామపంచాయతీ నిధులు కూడా ఎక్కువ మొత్తంలో ఇస్తే అరకొరగా ఉన్న పనులు మొత్తం పూర్తి చేస్తారని తెలిపారు.


