![]()
ధర్మశాల, మన భద్రాద్రి న్యూస్, మార్చి 09
హిమాచల్ ప్రదేష్ లోని ధర్మశాల స్టేడియంలో భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్టుల్లో 700 వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించిన ఇంగ్లాండ్ జట్టు పేసర్ జేమ్స్ అండర్సన్ పై భారత మాజీ క్రికెటర్ సచిన్ టెందుల్కర్ ప్రశంసలు కురిపించారు.2002లో ఆస్ట్రేలియాలో జేమ్స్ అండర్సన్ ఆటను మొదటిసారి చూశానని, బంతిపై అతడి నియంత్రణ ప్రత్యేకంగా కనిపిస్తుందని, ఒక ఫాస్ట్ బౌలర్ 22 ఏళ్లపాటు టెస్ట్ క్రికెట్ ఆడుతూ 700 వికెట్లు తీయడం గొప్ప విషయం, ఇది అద్భుతం అని సచిన్ ట్వీట్ చేశారు.


