Monday, March 23, 2026
HomeSports Newsఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రద్దు..!

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రద్దు..!

Loading

మన భద్రాద్రి స్పోర్ట్స్ న్యూస్: పాకిస్తాన్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇండియాతో జరగాల్సిన పాకిస్తాన్ మ్యాచ్ రద్దయిపోయింది. ప్రస్తుతం మాజీ క్రికెటర్లు అందరూ కలిసి వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ అనే టి20 టోర్నమెంట్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగానే పాకిస్తాన్, ఇండియా జట్లు కూడా పాల్గొంటున్నాయి. ఈ తరుణంలో ఈ టోర్నమెంట్ లో భాగంగా…. పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాళ మ్యాచ్ జరగాల్సి ఉంది.అయితే చివరి క్షణంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన ఇవాల్టి మ్యాచ్ రద్దయింది. రెండు దేశాల మధ్య ఇటీవల కాలంలో యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ జట్టుతో అసలు క్రికెట్ ఆడకూడదని… చాలా మంది అభిమానులు అలాగే.. ప్రతిపక్షాల నుంచి చాలా డిమాండ్లు వచ్చాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే.. WCL టోర్నీ మేనేజ్మెంట్ మ్యాచ్ రద్దు చేసింది.

ఇటీవల ఇరుదేశాల మధ్య హాకీ, వాలీబాల్ మ్యాచ్ లు జరగడంతో వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లో కూడా ప్లాన్ చేశామని యాజమాన్యం పేర్కొంది. కానీ ఇండియన్స్ ఫీలింగ్స్ హార్ట్ చేసినందుకు క్షమించండి అంటూ… టోర్నీ మేనేజ్మెంట్ కీలక ప్రకటన చేసింది. అటు ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్లు ధావన్, హర్భజన్ సింగ్, రైనా తదితర క్రికెటర్లు మ్యాచ్ ను బై కాట్ చేసిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page