![]()
ఉదయ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం
దుమ్ముగూడెం, మన భద్రాద్రి న్యూస్, మార్చి 23
మండల పరిధిలోని మారుమూల గ్రామమైన పైడిగూడెం లో భద్రాచలం ఉదయ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతం నిర్వహించినట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఈటె ఉదయ్ ఆధ్వర్యంలో 300 మందికి ఆదివాసి గిరిజన రోగులను పరీక్షించి, అవసరమైన రక్తపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 100 మందికి ఈసీజీ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉదయ్ మాట్లాడుతూ.. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఉదయ్ హాస్పిటల్ నిరంతరం సేవలు అందిస్తూనే ఉంటుందని భవిష్యత్తులో ఏజెన్సీ ప్రాంతాలలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మరిన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈటె ఉదయ్, ఈటె రాజేశ్వరరావు, పీఆర్ఓ అలవాల ప్రభాకర్, రాంబాల నాగేశ్వరరావు, కనితి రాంబాబు, ఉదయ్ హాస్పిటల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.


