![]()
ఎమ్మెల్యే కనకయ్య, మున్సిపల్ ఛైర్మెన్ డీవీ లకు సన్మానం
- పద్మశాలి భవన నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా
- పద్మశాలి సన్మాన సభలో ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్
మున్సిపాలిటీ పరిధిలోని నాలుగవ వార్డులో గల పద్మశాలి భవనం నందు పద్మశాలి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాచర్ల రాంచందర్ అధ్యక్షతన శుక్రవారం పద్మశాలి సంఘ ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ ఛైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మేరకు తొలుతగా పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మచ్చ ప్రభాకర్ మృతికి సంతాపం తెలియజేయటం జరిగింది. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పద్మశాలి రాష్ట్ర కమిటీ నేతలు మాచర్ల రాంచందర్, మంచికట్ల శ్రీనివాస్ లు మాట్లాడుతూ ఇల్లందు పద్మశాలి భవనానికి కస్తూరి మల్లమ్మ వారి భర్త లక్ష్మినర్సింహ పేరు మీద పద్మశాలి కుల భావితరాలకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో స్థలాన్ని దానంగా ఇచ్చినందుకు సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇల్లందులో పద్మశాలి సంఘం ఎలగొందుల నారాయణ నేతృత్వంలో మొదలై నేటితో నలభై వసంతాలు పూర్తయ్యాయని, 2001లో పద్మశాలి భవనం పేరుతో రిజిస్ట్రేషన్ చేయటం జరిగిందని తదుపరి వయోభారంతో ఎలాగొందుల నారాయణ 2008లో ప్రస్తుత కమిటీ వారికి సంఘాన్ని అప్పజెప్పి సలహాలు, సూచనలు అందిస్తున్నారని వారు తెలిపారు. సంఘ అభివృద్ధికి పద్మశాలి కుల బాందవుల సహాయ సహకారాలు మరువలేనివని, మున్ముందు సైతం ఇదేవిధంగా ఒకేతాటిపై నడవాలని కోరారు. కులస్తుల విరాళాలతో 40లక్షల రూపాయల వ్యయంతో పద్మశాలి భవనాన్ని నిర్మించ తలపెట్టామని, పనులు పూర్తి కావటానికి మరో 50 నుంచి 60 లక్షల రూపాయలు అవసరం అవుతాయని ఇందుకు ఎమ్మెల్యే కోరం కనకయ్య సహాయ సహకారాలు అందజేయాలని ఈ సందర్భంగా వారు కోరడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ ఛైర్మెన్ డీవీలు మాట్లాడుతూ ఇల్లందులో పద్మశాలి కులస్తులు అధికంగా ఉన్నారని, కులం అంటే మనమందరం అంటూ అన్ని రకాలుగా చేయూతని అందిస్తూ ఒక మాటకు కట్టుబడి ఒకే తాటిపై పద్మశాలి కులస్తులు అందరూ ఉంటారని, ఇది నిజంగా అభినందనీయం అని వారు పేర్కొన్నారు. పద్మశాలి భవన నిర్మాణానికి సంబంధించిన 50 లక్షల రూపాయల నిధుల ఫైల్ కలెక్టర్ వద్ద పెండింగ్లో ఉన్నదని, భవన నిర్మాణానికి అన్నిరకాలుగా తమ సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని, వచ్చే ఏడాది కల్లా భవన నిర్మాణాన్ని పూర్తిచేసుకొని ఎమ్మెల్యేగా నేనే ప్రారంభిస్తానని కోరం కనకయ్య స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కనకయ్య, మున్సిపల్ ఛైర్మెన్ డీవీలను పద్మశాలి సంఘం కమిటీ ఆధ్వర్యంలో పూలబొకేలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు రాంచందర్, ప్రధాన కార్యదర్శి ఉసకోయల రాజేశ్వరరావు, కౌన్సిలర్ సయ్యద్ ఆజాం, ఉపాధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, కందగట్ల శ్రీనివాస్, ఆడెపు శివనారాయణ, గడదాసు నాగేశ్వరరావు, వెలగందుల నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు పెగడ రఘు రాములు, మామిడి భిక్షపతి, వేలగందుల నారాయణ, కమిటీ సభ్యులు బాస శ్రీనివాసరావు, కోట సత్యనారాయణ, శ్రీరాముల రాంచందర్, ఆడేపు కుమార్, మేకల ప్రకాష్ రావు, కులస్తులు తదితరులు పాల్గొన్నారు.


