![]()
ఎమ్మెల్యే తెల్లంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేతో పార్టీ మారాం.. పదవుల కోసం కాదు
కార్యకర్తల యోగక్షేమాలు అడిగి తెలుసుకునే వ్యక్తి తెల్లం
చర్ల, మన భద్రాద్రి న్యూస్
అనునిత్యం నియోజకవర్గ ప్రజల కోసం పాటుపడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరుస్తూ ఆదరాభిమానాలు చొరగోన్న ఎమ్మెల్యే తెల్లంపై సొంత పార్టీ వారే అనుచిత వ్యాఖ్యలు చేయటం సరి కాదని, మండల పార్టీని వర్గాలుగా విభజించి ఒక వర్గం వారికే ఎమ్మెల్యే న్యాయం చేస్తున్నారు,వారితోనే తిరుగుతున్నారు అని కొంతమంది నాయకులు ఆరోపించటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. అభివృద్ధికై ఎమ్మెల్యే తో కలిసి నడవాల్సిన నాయకులు ఇలా ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సబబు కాదని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చీమలమర్రి మురళి క్రీష్ణ అన్నారు.
ఆదివారం మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనునిత్యం ప్రజల కోసం పాటుపడుతూ ప్రజాసంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ నియోజకవర్గ, మండల నాయకులతో మమేకమై వారి ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తూ అందరివాడు అనిపించుకుంటున్న ఎమ్మెల్యే పై ఇలా సొంత పార్టీ వారు బురద జల్లటం ఏమాత్రం సబబు కాదని అన్నారు. నాయకులు పోలిన లంక రాజు మాట్లాడుతూ నాడు టిఆర్ఎస్ పార్టీ లో ఎమ్మెల్యేగా గెలిచి భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే డాక్టర్ ఎమ్మెల్యే వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగిందని అన్నారు. తెల్లం గెలుపుకై అహర్నిశలు శ్రమించిన తాము కూడా ఎమ్మెల్యే తోనే పయనిస్తామంటూ టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగిందని అన్నారు.
నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న ఎమ్మెల్యే పై ఇలా సొంత పార్టీ వారే అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమచితం కాదని అన్నారు. నియోజకవర్గ, మండల, వార్డుల వారీగా మండల నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అని అన్నారు.నాడు టీఆర్ఎస్ పార్టీలో తెల్లం గెలుపుకై రాత్రనక పగలనక కష్టపడి తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో తమ నాయకుడు చేరడంతో తమ నాయకుడు అడుగుజాడల్లో తాము కూడా నడుస్తామంటూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు.అంతేగాని పార్టీలో పదవులను ఆశించి కాదని, వేరే పార్టీలో ఎన్నో పదవులు ఉన్నా ఎలాంటి పదవులు ఆశించకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ కోసమే పని చేస్తున్నామని అన్నారు. అలాంటి తమ నాయకుడు వెంకట్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని తెలిపారు.ఈ సమావేశంలో గుండె పూడి భాస్కరరావు,గుండెపూడి సతీష్,పోట్రు బ్రహ్మానంద రెడ్డి, ముమ్మినేని అరవింద్, కొసరాజు రాజా, అలవాల బాలు, బోరా పెద్దిరెడ్డి, మహిళా నాయకురాలు కట్ట అమ్మాజీ, బోళ్ల వినోద్, ఆలం ఈశ్వర్, రావుల సతీష్, తదితరులు పాల్గొన్నారు


