Monday, March 23, 2026
HomeTelangana Newsఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం

ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం

Loading

  • రెండు స్పాట్స్‌ను గుర్తించిన కేరళ డాగ్‌ స్క్వాడ్స్‌..
  • టన్నెల్‌లో భరించలేని దుర్వాసన

మన భద్రాద్రి వెబ్ డెస్క్:

ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించి పదిహేనవ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతోంది. గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీ కోసం టన్నెల్ ఎండ్ పాయింట్ సమీపంలోని రెండు స్పాట్స్ కీలకంగా మారాయి.

ఇదివరకే రెండు స్పాట్స్ గుర్తించి, తవ్వకాలు చేస్తోన్న రెస్క్యూ బృందాలు. కేరళ నుంచి వచ్చిన ప్రత్యేక డాగ్‌ స్క్వాడ్‌ సైతం శుక్రవారం అవే స్పాట్స్ ను గుర్తించాయి. దీంతో రెండు చోట్లా తవ్వకాలు సంక్లిష్టంగా మారాయి. భారీగా నీరు ఊరుతుండడంతో మూడు పంప్ లతో నీటిని బయటకు పంపుతున్నారు.

ఎండ్ పాయింట్ సమీపంలో టీబీఎం మిషన్ ముందు భాగం శకలాలతో పూర్తిగా బురదలో కూరుకుపోయింది. మిషన్ కింద కంపార్ట్ మెంట్ లో కార్మికుల ఆచూకీ ఉండొచ్చని రెస్క్యూ బృందాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టన్నెల్ లో విరిగిపోయిన టీబీఎం మిషన్ శఖలాలను వేగంగా బయటికి తీస్తున్నారు. అయితే ప్రస్తుతం టన్నెల్‌లో తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో భరించలేనంతగా దుర్వాసన వస్తున్నట్లు సమచారం. బహుశా అక్కడే కార్మికుల ఆచూకీ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page