![]()
ఆళ్లపల్లి, మన భద్రాద్రి న్యూస్
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇల్లందు డీఎస్పీ చంద్రభాను సూచనలతో శుక్రవారం ఆళ్ళపల్లి ఎస్సై రతీష్ ఆధ్వర్యంలో మండలంలోని గుత్తికోయ గ్రామమైన ముత్తాపురంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రతీష్ గ్రామస్థులందరితో సమావేశమై అక్కడ నివసించే పదకొండు కుటుంబాలతో మాట్లాడారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని, అదేవిధంగా నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని వారికి సూచించారు. దోమల బారిన పడకుండా ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తగు జాగ్రత్తలు చెప్పారు. డెంగ్యూ మరియు మలేరియా లాంటి విష జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని గ్రామస్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, టీఎస్ఎస్పీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.


