![]()
ఐటీడీఏ ఆధ్వర్యంలో జాబ్ మేళా
భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్, జనవరి 19
సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం ఆధ్వర్యంలో ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో గల గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే నిమిత్తం ఈనెల 23 వ తారీఖు నాడు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఇక్షనా హోమ్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ ఉద్యోగాలకు, ఓపిడిఎస్ఎస్ సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీలో, సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని అన్నారు. అలాగే గిరిజన నిరుద్యోగ యువతకు వివిధ శిక్షణ సంస్థల ద్వారా వెబ్ మొబైల్ అప్లికేషన్స్, బ్యూటీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, సీసీటీవీ టెక్నీషియన్ మరియు టూవీలర్ మెకానిక్ శిక్షణలను నెల రోజుల నుండి రెండు నెలల ఉచిత భోజన వసతితో పాటు శిక్షణ ఇప్పించి, ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ జాబ్ మేళాలో ఓపిడి సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీ నందు సెక్యూరిటీ గార్డులు 15 పోస్టులు కలవని, అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి అని, ఎత్తు 5.6 ఉండి పదవ తరగతి మరియు ఆ పైన ఏదైనా కోర్సు చదివి ఉండాలని, నెలకు 12,400 రూపాయలు వేతనం, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కలదని, అభ్యర్థులు పాల్వంచలో పనిచేయవలసి ఉంటుందని, ఈక్షనా హోమ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నందు కేర్ టేకర్స్ గా 50 పోస్టులు కలవని, వయస్సు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు లోపు ఉండాలని, పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్, ఏబుల్ టు హ్యాండిల్ పేషంట్ మరియు ఎబుల్ టూర్ లెర్న్, అభ్యర్థి బరువు 40 కేజీలు ఉండాలని, నెలకు వేతనం 13 వేల నుండి 20,000 రూపాయల వరకు ఉంటుందని, అలాగే అదే కంపెనీలో నర్స్ పోస్టులు 20 కలవని, వయస్సు 18 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలని, అభ్యర్థులు ఏఎన్ఎం, జిఎన్ఎం కోర్సుతో పాటు క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ, వార్డ్ లలో పనిచేసిన అనుభవం ఉండాలని, నెలసరి వేతనం 18 వేల నుండి 35 వేల రూపాయల వరకు ఉంటుందని, అభ్యర్థులు హైదరాబాదులో పని చేయవలసి ఉంటుంది అని ఆయన అన్నారు.
అలాగే వెబ్ మొబైల్ అప్లికేషన్ పోస్ట్ కొరకు ఆడవారికి మాత్రమే ఇంటర్ లేదా ఆపై చదువు ఉండాలని, అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు ఉండాలని వీరు వైటిసి భద్రాచలంలో పని చేయాలని, బ్యూటీషియన్ పోస్ట్ కొరకు ఆడవారు మాత్రమే, వయస్సు 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలని, పదవ తరగతి లేదా ఆపై చదువు ఉండి ఐటిసి ప్రథమ్ భద్రాచలంలో పని చేయాలని, అసిస్టెంట్ ఎలక్ట్రిషన్ పోస్ట్ కొరకు అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు ఉండాలని, ఆడవారు, మగవారు అప్లై చేసుకోవచ్చు అని, పదవ తరగతి ఆపైన చదివి ఉండాలని, వీరు ఐటిసి ప్రథమ్ బూర్గంపాడులో పని చేయాలని, సీసీటీవీ టెక్నీషియన్ పోస్టులు కొరకు మగవారు అప్లై చేసుకోవచ్చు అని, వయస్సు 18 నుండి 35 సంవత్సరాలు ఉండాలని, పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినవారు అప్లై చేసుకోవచ్చని, వీరు ఆర్ఎస్ ఈటిఐ ఖమ్మం నందు పనిచేయాలని ఆయన అన్నారు. ఆసక్తి గల గిరిజన నిరుద్యోగ యువత విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ జిరాక్స్ సర్టిఫికెట్లతో ఈనెల 23 నాడు ఉదయం 9 గంటలకు భద్రాచలం లోని ఐటిడిఏ ప్రాంగణంలో గల యూత్ ట్రైనింగ్ సెంటర్ నందు కౌన్సిలింగ్ కు హాజరు కావాలని, ఇతర వివరముల కొరకు 8143840906, 6302608905 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.


