![]()
రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్భద్ర వారి ఆధ్వర్యంలో రోటరాక్ట్ క్లబ్ వారు ప్రజ్ఞ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. భద్రాచలం మరియు బూర్గంపాడు మండల పరిధిలో ఉన్న స్కూల్ విద్యార్థి మరియు విద్యార్థినులకు విద్య మరియు సాంకేతిక నైపుణ్యాలను గుర్తించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. తద్వారా మంచి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు కూడా అందజేశారు. ఈ కార్య్రమానికి 21 స్థానిక స్కూల్స్ నుంచి 862 మంది హజరయ్యారు. ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా రో. ఐటీసి యూనిట్ హెడ్ శ్రీ సిద్దార్థ మహంతి , రొ రాజశేఖర్, రొ భాస్కర రావు, రొ కునిసెట్టి రాంబాబు, చెంగల్ రావు , డివిఎం నాయుడు, ప్రఫుల్ల, యాగి చంద్రశేఖర్, కిషోర్ కుమార్, నాగ మల్లేశ్వరరావు , మరియు ఇతర రోటేరియన్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రస్తుత ఐటీసీ రోటరీ క్లబ్ ప్రసిడెంట్ రో. జయంత్ కుమార్ దాస్ మరియు సెక్రెటరీ కెవిఎస్ గోవిందరావు , రోటరాక్ట్ ప్రెసిడెంట్ శ్రీ నీలి మురళి మరియు సెక్రెటరీ గాయత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్ఆర్ 3150 రో. శైలేష్ మరియు జిఆర్ఆర్ 3 రో. అశోక్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ సభ్యులు మరియు 40 మంది రోటరాక్టర్ సభ్యులు పాల్గొని సేవలు అందించారు.


