![]()
ఐటీసీ వావ్ సంస్థ ఆధ్వర్యంలో తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో గల పాత సారపాక కాలనీలో ఐటీసీ ఆర్థిక సహకారంతో ఈశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వావ్ సంస్థ ప్రతినిధి కాలనీలోని ప్రతి గృహాన్ని సందర్శించి తడి చెత్త, పొడి చెత్త గురించి వివరించడం జరిగింది. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి తెలియజేయడం జరిగింది. ఇంటి ముందు నీటి నిల్వలు లేకుండా చూడాలని, ఒకవేళ ఉండే పరిస్థితి ఏర్పడితే కిరోసిన్ వంటి ద్రావణాలు చల్లాలని తెలిపారు. తద్వారా డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాల బారిన పడకుండా ఉండొచ్చని అన్నారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ చెత్త సేకరణ వాహనానికి సహకరించాలని, గతంలో ఇచ్చిన చెత్త బుట్టలను పరిశీలించి తడి, పొడి చెత్తను వేరు చేయుట గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వావ్ సంస్థ కోఆర్డినేటర్ రోజా, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.


