Tuesday, March 24, 2026
HomeHyderabadఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Loading

హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: రాబోయే ఐదు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఇప్పటికే నేడు, రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

బంగాళాఖాతంలో ఈ నెల జూలై 24వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం మరింత పెరిగి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

హైదరాబాద్‌లో కూడా వర్షాలు మళ్ళీ తీవ్రంగా కురిసే అవకాశం ఉందని సూచనలున్నాయి. నేడు మరియు రేపు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. రోడ్లపై నీటిమునిగే పరిస్థితులు, ట్రాఫిక్ అంతరాయం వంటి సమస్యలకు నగరవాసులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page