Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఓసి 2 పీవీ కాలనీలో పిచ్చి మొక్కల తొలగింపునకు చర్యలు చేపట్టాలి

ఓసి 2 పీవీ కాలనీలో పిచ్చి మొక్కల తొలగింపునకు చర్యలు చేపట్టాలి

Loading

ఓసి 2 పీవీ కాలనీలో పిచ్చి మొక్కల తొలగింపునకు చర్యలు చేపట్టాలి,

పశువుల కుక్కల కోతుల బెడద తీర్చాలి*

ఏరియా ఎస్ ఓ టు జి ఎం బి. శ్రీనివాసచారికి వినతి పత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు

విష సర్పాల సంచారం నేపథ్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్, ఎస్ఎంఎస్ ప్లాంట్, ఓసి 2 పీవీ కాలనీలో పిచ్చి మొక్కల తొలగింపునకు చర్యలు చేపట్టాలి, పశువుల కుక్కల కోతుల బెడద తీర్చాలనీ కోరుతూ మణుగూరుకు చెందిన కర్నే బాబురావు గురువారం నాడు
ఏరియా ఎస్ ఓ టు జి ఎం బి. శ్రీనివాసచారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎస్ఎంఎస్ ప్లాంట్ లో ఒక ప్రైవేటు వాహన డ్రైవర్ పాము కాటుకు గురై నరకయాతన అనుభవించాడనీ సకాలంలో మెరుగైన చికిత్స అందటంతో అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుండి బయటపడ్డాడనీ సంతోషం కానీ ఈ సంఘటనతో ఎస్ ఎం ఎస్ ప్లాంట్ సోలార్ విద్యుత్ ప్లాంట్ మరియు పీవీ కాలనీలో ఓసి- 2 లో కార్మికులు, కాంట్రాక్ట్ వర్కర్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బ్లాస్టింగ్ విభాగం ఎస్ ఎం ఎస్ ప్లాంట్, సోలార్ విద్యుత్ ప్లాంట్, పీకే ఓ సి నూతన క్షేత్ర కార్యాలయం పీవీ కాలనీ మణుగూరు ఓసి కార్యాలయం, ఏరియా వర్క్ షాప్, కే పి యు జి తదితర గనులు డిపార్ట్మెంట్లలో వర్షాకాలం కావడంతో చెత్త విపరీతంగా పెరిగి విష సర్పాలతో పాటు దోమలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి కార్మికుల సంక్షేమ రీత్యా పిచ్చి మొక్కలు నరికించాలని పాములకు నిలయంగా మారిన పుట్టలను తొలగించాలని దోమల నివారణకు సింగరేణి శానిటరీ విభాగం ఆధ్వర్యంలో ఫాగింగ్ నిర్వహించాలని, కోతుల కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని మరియు పీవీ కాలనీలో పశువుల సంచారంతో కాలనీ అశుభ్రతతో పాటు దుర్గంధం వెదజల్లుతుంది ముచ్చటపడి కాలనీవాసులు పెంచుకుంటున్న పూల మొక్కలను కూడా పశువులు తినేస్తున్నాయి ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని పరిష్కారం దిశగా యోచన చేయాలని సింగరేణి ఉద్యోగుల తరఫున మరియు కాంట్రాక్ట్ కార్మికుల తరఫున ఏరియా సింగరేణి యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను
1) మణుగూరు ఏరియాలోని అన్ని గనులు డిపార్ట్మెంట్లలో, కాలనీలో విష సర్పాల నివారణకు పిచ్చి మొక్కలు మరియు పుట్టలు తొలగించాలి దోమల నివారణకు పాగింగ్ చేయాలి కోతులు,కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలి.
2) కార్మిక కుటుంబాల్లో అవగాహన కలిగించి పరిసరాల పరిశుభ్రత పాటించే విధంగా చూడాలి
3) కూనవరం, ముత్యాలమ్మ నగర్ పంచాయతీల పాలకవర్గంతో సమన్వయం చేసుకొని పీవీ కాలనీలో పశువుల సంచారాన్ని నివారించాలి. తాను చేసిన విజ్ఞాపన పట్ల ఎస్ ఓటు జిఎం సానుకూలంగా స్పందించారని, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపడతామని, తెలిపినట్లు బాబురావు మీడియాకు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page