![]()
-వారం రోజులలో సమస్య పరిష్కరిస్తానని సింగరేణి జిఎం హామీ
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, మే 17
మణుగూరు సింగరేణి ఓసి 2 లో హిందుస్థాన్ ట్రేడ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కార్మికులను 12 గంటలు శ్రమ చేయిస్తూ, కేవలం ఎనిమిది గంటల వేతనం కూడా చెల్లించడం లేదని శుక్రవారం ఏఐటీయూసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ప్రశ్నించిన కార్మికుల జీతాలను నెలకు రూ. 1000 నుండి రూ. 2000 రూపాయల చొప్పున కోత విధిస్తూ, ఇబ్బందుల గురి చేస్తున్నారని, కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేదని, ఓటీ (ఓవర్ టైం) చేస్తున్న కార్మికులకు అదనపు వేతనం చెల్లించటం లేదని, కనీసం భోజన వసతి కూడా లేదని మండిపడ్డారు. ప్రతి సంవత్సరం దీపావళికిచ్చే బోనస్ కూడా చెల్లించడం లేదని వారు అన్నారు. ఆడిగిన కార్మికులపై కక్ష సాధింపు చేస్తున్నారని, ఏ విషయంపై మణుగూరు సింగరేణి జిఎం దుర్గం రామచందర్ కి ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మీనారాయణ, బ్రాంచి ఉపాధ్యక్షులు రాంనర్సయ్య ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించి, వారికి సమస్యలను వివరించారు. త్వరలో విచారణ జరిపి బాధితులందరికీ న్యాయం చేస్తాననని జిఎం హామీ ఇచ్చారని వారు తెలిపారు.


