Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

Loading

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

బూర్గంపహాడ్, మన భద్రాద్రి బ్యూరో

బూర్గంపాడు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో బూర్గంపాడు మండలానికి చెందిన 105 మందికి 1 కోటి 5 లక్షల 12 వేల 180 రూపాయల విలువ గల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. బూర్గంపాడు మండలానికి కోట్ల నిధులు సమకూర్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, పేద ప్రజల శ్రేయస్సు కొరకే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, రైతు రుణమాఫీ, సన్న బియ్యం, సన్న ధాన్యం పంటకు 500 బోనస్, ఇలా అనేక పథకాలను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలియజేశారు.

అదేవిధంగా వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకొని తీవ్ర ఎండలకు బయట తిరగొద్దని ఆయన సూచించారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీఏ తాతారావు, బూర్గంపాడు ఎమ్మార్వో ముజాహిద్, ఎంపీడీఓ జమాలా రెడ్డి, బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page