![]()
-రాత్రి అయితే చాలు అటువైపు వెళ్ళాలంటే భయాందోళనకు గురవుతున్న సిబ్బంది మరియు విద్యార్థులు
-తక్షణమే వీధిలైట్లు ఏర్పాటు ఏర్పాటు చేయాలి
-ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ డిమాండ్
జూలూరుపాడు, మన భద్రాద్రి న్యూస్
ఏఐఎస్ఎఫ్ మండల ముఖ్య నాయకుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా సహాయ కార్యదర్శి వంశీ పాల్గొని మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా బాలికల విద్యాలయానికి సాయంత్రం అయితే చాలు వెళ్లడానికి భయాందోళన గురవుతున్నారని వంశీ అన్నారు. కస్తూరిబా బాలికల విద్యాలయం మండల కేంద్రం నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో రాత్రి సమయంలో వీధిలైట్లు లేకపోవడం వల్ల సిబ్బంది గానీ ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీకి ఎవరైనా వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ కనపడుతుందని విమర్శించారు. సమస్యలు ఉన్నాయంటే అదిగో చేస్తున్నాం.. ఇదిగో చేస్తున్నాం అని చెప్పడం సరైన సమాధానం కాదని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, రాష్ట్ర యంత్రాంగం స్పందించి రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ పక్షాన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బాలాజీ, శివ అనిల్, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


