![]()
హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో, మార్చి 01
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ శనివారం వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 05 న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసి ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఆయన నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది.


