![]()
-ఆయన మరణం పార్టీకి తీరని లోటు
-మండల కాంగ్రెస్ నాయకులు
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, మే 21
మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ మలిదశ ఉద్యమ జేఏసీ ఉమ్మడి చండ్రుగొండ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు మహమ్మద్ సాబీర్ హుస్సేన్(67) హైదరాబాదులో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అకాల మరణ వార్త విని మండల ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు. నాడు ఇందిరా గాంధీ ప్రజా సంక్షేమ పాలనకు ఆకర్షితుడై ఇరువై ఏళ్ల యుక్త వయసులో 1975 సంవత్సరంలో కాంగ్రెస్ జెండా పట్టి, పార్టీ కష్ట కాలంలో ఉన్నా కూడా వెన్నంటే ఉండి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కోసం తన ఆరోగ్యం సహకరించకున్నా, తన శక్తికి మించి ప్రజల కోసం అనునిత్యం పనిచేసిన నిస్వార్థ నాయకుడు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో తనవంతు కృషి చేసిన నాయకుడి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, తమ నాయకుడి కడసారి చూపు కోసం మండల ప్రజలు, రాజకీయ ప్రముఖులు తండోపతండాలుగా తరలివచ్చారు.. ఆయన పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతితో మండల కేంద్రంలో విషాద చాయాలు అలుముకున్నాయి.


