![]()
కాంట్రాక్టు కార్మికుల శ్రమతో వచ్చిన లాభాలలో కార్మికులకు 20 వేలు ఇవ్వాలి.
యాకుబ్ షా వలి, నబి, బి,రామ్ సింగ్, డిమాండ్.
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, సెప్టెంబర్ 06
కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం టేకులపల్లి మండలంలోని, సింగరేణి కాలనీ, పార్క్ కేఓసి, పిఓ ఆఫీస్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల మస్టర్ అడ్డావద్ద, సెప్టెంబర్ 12న చలో ప్రజా భవన్ ప్రచారం కోసం పోస్టర్స్ కరపత్రాలు, ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు షేక్ యాకుబ్ షావలి, ఎస్ ఏ నబి, రామ్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ, సింగరేణిలో పర్మినెంట్ కార్మికులు 40, వేల మంది ఉండగా, కాంట్రాక్టు కార్మికులు 30 వేల మంది 56 డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారని అన్నారు. ఒక్క పర్మినెంట్ కార్మికుడికి ఇచ్చే జీతంతో, 10, మంది కాంట్రాక్టు కార్మికులతో పని చేయించుకుంటున్నారని తక్కువ వేతనాలు ఇవ్వడం మూలానే ఈరోజు సింగరేణిలో లాభాలు వచ్చాయని గుర్తు చేశారు. ఈ లాభాలలో పోయిన సంవత్సరం 5000 రూపాయలు మాత్రమే కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చారని, ఈ వార్షిక లాభాలలో 20వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 12 సంవత్సరాలుగా కార్మికుల వేతనాలు పెంచలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులనే జీతాలు పెంచుతున్న అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని 20 నెలలు దాటినా ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు.అమలు కొరకు, ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం మీద ఒత్తిడి పెంచేందుకు కాంట్రాక్టు కార్మికులు వ్యక్తిగత దరఖాస్తులతో సెప్టెంబర్12న హైదరాబాదులోని చలో ప్రజాభవన్ కు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జరుపుల సుందర్, కుడుదుల వీరన్న, రామ్ కుమర్, బాలు, శివయ్య, షఫీ, నాగమణి, ఎర్రమ్మ తదితరులు పాల్గొన్నారు.



