![]()
బూర్గంపహాడ్ మండలం, సారపాక లో మంగళవారం ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్ కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ A- 49 INTUC కి (అనుబంధం) ప్రధాన కార్యదర్శి పాటి సోమిరెడ్డి ఆధ్వర్యంలో INTUC ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి , అధ్యక్షులు గోనే రామారావు ముఖ్య అతిథులుగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటిసి కాంటాక్ట్ వర్కర్ల సమస్యలు అయిన స్కిల్డ్ మ్యాట్రిక్స్ అమలుపరచుటపై నిర్లక్ష్యం మరియు క్యాజువల్ బైక్ స్టాండ్, పంచ్ గేటు, విఆర్ఎస్ స్కీం, కాలనీ మెయింటినెన్స్ కార్మికులకు పంచ్ కార్డుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమస్యలపై అధికార యూనియన్ (TNTUC) క్యాజువల్ సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎప్పుడూ కూడా కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయడంలో దారుణంగా విఫలమైందని, INTUC తీసుకొచ్చిన స్కిల్ మ్యాట్రిక్స్ అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, కంపెనీలో ఎక్కువ శాతం కష్టపడుతున్న క్యాజువల్ కి బోనస్ ల విషయంలో చాలా అన్యాయం జరుగుతుందని, చాలా తక్కువగా వస్తున్నాయని వీటిపై సుదీర్ఘంగా చర్చించి అందరికీ అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.


