Monday, March 23, 2026
HomeAndhra Pradeshకానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

Loading

తిరువూరు, మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఎ.కొండూరు పోలీస్‌ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కె. కాంతారావు(40) మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

తిరువూరు పట్టణ శివారులోని టౌన్‌షిప్‌లో అపస్మారక స్థితిలో ఉన్న కాంతారావును స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి తిరువూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమించడంతో విజయవాడ జీజీహెచ్‌కు సిఫారసు చేశారు. తిరువూరు పోలీసుస్టేషన్లో పనిచేస్తూ ఇటీవల సాధారణ బదిలీల్లో ఎ.కొండూరుకు బదిలీ అయిన కాంతారావు విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరిస్తాడని పోలీసు సిబ్బంది చెబుతున్నారు. తిరువూరు కోర్టులో కాంతారావుపై ఒక న్యాయవాది నమోదు చేసిన ప్రైవేటు ఫిర్యాదు నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశారని భావిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page