Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemకార్మిక సమస్యలపై ఇల్లందు సహాయ కార్మిక శాఖ అధికారి కి వినతి పత్రం ఇచ్చిన సిఐటియు

కార్మిక సమస్యలపై ఇల్లందు సహాయ కార్మిక శాఖ అధికారి కి వినతి పత్రం ఇచ్చిన సిఐటియు

Loading

కార్మిక సమస్యలపై ఇల్లందు సహాయ కార్మిక శాఖ అధికారి కి వినతి పత్రం ఇచ్చిన సిఐటియు

ఇల్లందు మన భద్రాద్రి న్యూస్ జులై 23


ఇల్లందు ఏ ఎల్ ఓ గా నూతంగా బదిలీ పై వచ్చిన శాస్త్రి కి సిఐటియు ప్రాంతీయ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ కార్మిక శాఖ ద్వారా కార్మికుల ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలైన వెల్ఫేర్ బోర్డు క్లైముల చెల్లింపులు జరగకపోవడం, కొత్త కార్డులు, రెన్యువల్స్ లలో ఆన్లైన్ సమస్యలు తలెత్తడం ఆన్లైన్ తంబింగ్ విధానం విధానంలో తలెత్తే సాంకేతిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. అట్లాగే వివిధ రకాల షాపులలో పనిచేస్తున్న కార్మికులకు షాప్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంప్లాయిమెంట్ లో కనీస వేతనాలు అమలు చేయడం లేదని వాళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఎనిమిది గంటల పని దినం అమలు కావడం లేదని, గుర్తింపు కార్డులు పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించకుండా పెట్రోల్ బంకు గ్యాస్ గోడౌన్లు సినిమా హాళ్ళు వివిధ రకాల షాపులలో పనిచేస్తున్న గుమాస్తాలు, మహిళా కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయని కార్మిక శాఖ ద్వారా వాటిని పరిష్కరించి సమస్త షాపు లలో పని చేసే వారికి న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు అబ్దుల్ నబీ, తాళ్లూరి కృష్ణ లు పాల్గొని మాట్లాడుతూ ఇల్లందుకు బదిలీపై వచ్చిన కార్మిక శాఖ సహాయ అధికారి శాస్త్రి కార్మికుల సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామ నాగరాజు, బాబు మేస్త్రి, బద్రు, సత్యనారాయణ కోరి, కూరపాటి వెంకన్న, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page